Home  »  TV News  »  Ye Devi Varamo Neevu : అంజలిని వెతుక్కుంటూ వైజాగ్ వెళ్లిన మనీష్.. జానకమ్మ చివరి కోరిక నెరవేరుతుందా?

Updated : Jul 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Dhevi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో....  జానకమ్మ ప్రాణాప్రాయ స్థితిలో అంజలితో మాట్లాడుతుంటుంది.‌ అంజలి నీ జీవితానికి సంబంధించిన ఒక నిజం చెప్పాలని అక్కడున్న ఒక ఫైల్ తీసుకొని రమ్మని చెప్తుంది జానకమ్మ. అందులో రాజారాం పేరుతో ఉన్న చెక్కు చూపిస్తూ ఇదే నీ జీవితానికి సరైన మార్గం చూపిస్తుందని అంజలితో జానకమ్మ అంటుంది. రాజారాం అంటే మొన్న వచ్చిన తాతయ్య కదా అని అంజలి అంటుంది. అవును అతని దగ్గరికి వెళ్తే నీ కుటుంబం గురించి తెలుస్తుందని చెప్పి జానకమ్మ చనిపోతుంది. దాంతో అంజలి ఏడుస్తుంది.

మరొకవైపు జానకమ్మ చనిపోయిందని రాజారాంకి తెలుస్తుంది. ఇప్పటివరకు జానకమ్మ దగ్గర నా మనవరాలు ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి.. నా మనవరాలిని ఎవరు చూసుకుంటారని రాజారాం టెన్షన్ పడుతాడు. మరొకవైపు జానకమ్మ దహనసంస్కారాలు పూర్తవుతాయి. ఆ తర్వాత రాజారాం తన మనవడు మనిష్ కి కాల్ చేసి అర్జెంట్ గా ఇంటికి రమ్మని చెప్తాడు. దాంతో మనీష్ హడావిడి గా ఇంటికి వస్తాడు. ఏమైంది తాతయ్య అని అడుగుతాడు. నేను ఒకటి చెప్తాను చేస్తావా.. ఎందుకు ఏమిటీ అని క్వశ్చన్స్ వెయ్యద్దు.. అలా అడగనని మాటివ్వమని రాజారాం అనగానే మనీష్ మాటిస్తాడు. నువ్వు వైజాగ్ కి వెళ్ళు అక్కడ శబరి ఆశ్రమంలో అంజలి అని ఉంటుంది. తనని తీసుకొని రా అని చెప్పగానే ఎందుకని మనీష్ అడుగుతాడు. అలా అడగనని మాటిచ్చావని రాజారాం అంటాడు. దాంతో మనీష్ వెంటనే వైజాగ్ బయల్దేరతాడు. ఆశ్రమంలో ఉన్న అంజలి దగ్గరికి వెళ్తాడు.

జానకమ్మ ఫోటో దగ్గర అంజలి ఏడుస్తూ ఉంటుంది. జానకమ్మ ఫోటో చూసి మనీష్ షాక్ అవుతాడు. తన ఫోటోకి మొక్కుకుంటాడు. తాతయ్య రమ్మన్న విషయం చెప్తే అసలు రాదని చెప్పకుండా తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. అంజలి నాతో పాటురా అని అంటాడు. నేను ఎక్కడికి రాను.. మీరు చేసింది చాలు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంజలి అంటుంది. మనీష్ కోపంగా వెళ్తాడు కానీ వాళ్ళ తాతయ్య మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. తరువాయి భాగంలో మనీష్ లేచేసరికి అంజలి ఆశ్రమంలో ఉండదు. అంజలి నేరుగా జానకమ్మ ఇచ్చిన అడ్రెస్ పట్టుకొని రాజారాం ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.